ఇండియాలో కోవిడ్ కేసులు పెరిగిపోతున్నాయి. ఆ నెంబర్ లక్షకు రీచ్ అయిపోతుంది. సామాన్యులతో పాటు సెలబ్రిటీలు కూడా కరోనా బారిన పడుతున్నారు. ఈ మధ్యకాలంలో కరోనా బారిన సెలబ్రిటీలు ఎవరంటే..?
మహేష్ బాబు - ఈ మధ్యకాలంలో పలు దేశాలకు తిరిగిన మహేష్ కి కోవిడ్ పాజిటివ్ గా నిర్ధారణ అయింది.
మంచు మనోజ్ - ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా తనకు కోవిడ్ వచ్చినట్లు చెప్పారు మంచు మనోజ్
విశ్వక్ సేన్ - ఈ యంగ్ హీరో కూడా కోవిడ్ బారిన పడ్డారు.
మంచులక్ష్మీ - తనకు కరోనా సోకినట్లు ట్విట్టర్ ద్వారా వెల్లడించింది మంచువారమ్మాయి.
మీనా - కొత్త ఏడాది కోవిడ్ తో మొదలైందని చెప్పింది మీనా
కమల్ హాసన్ - కొన్నిరోజుల క్రితం కోవిడ్ బారిన పడి కోలుకున్నారు కమల్
విక్రమ్ - స్టార్ హీరో విక్రమ్ కి కూడా కరోనా సోకింది.
తమన్ - టాప్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ కి కరోనా సోకినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని ఇంకా బయటపెట్టలేదు.
అరుణ్ విజయ్ - ఈ కోలీవుడ్ యాక్టర్ 'సాహో' సినిమాతో తెలుగు వారికి దగ్గరయ్యాడు. ఈయనకు కోవిడ్ పాజిటివ్ వచ్చింది.