కళ్లముందే కన్నబిడ్డలను కోల్పోతే ఏ తల్లితండ్రులు తట్టుకోలేరు. అలాంటి పుత్రశోకాన్నిమన సినీ తారలు భరిస్తున్నారు. సీనియర్ ఎన్టీఆర్ పెద్ద కొడుకు రామకృష్ణ చిన్నవయసులోనే అనారోగ్యంతో మరణించారు. హరికృష్ణ పెద్ద కొడుకు జానకిరామ్ రోడ్ యాక్సిడెంట్ లో మరణించారు. కొన్నాళ్లకు హరికృష్ణ కూడా రోడ్ యాక్సిడెంట్ లో చనిపోయారు. గొల్లపూడి మారుతీరావు కుమారుడు శ్రీనివాస్ షూటింగ్ జరుగుతున్న సమయంలో ప్రమాదవశాత్తు వైజాగ్ బీచ్ లో పడి మృతి చెందారు. పరుచూరి వెంకటేశ్వరరావు తనయుడు పరుచూరి రఘుబాబు అనారోగ్యంతో మరణించారు.కమెడియన్ బాబు మోహన్ కొడుకు పవన్ కుమార్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు.కోట శ్రీనివాసరావు కొడుకు కోట ప్రసాద్.. బైక్ ప్రమాదానికి గురవ్వడంతో మరణించారు.ప్రభుదేవా కొడుకు చిన్న వయసులోనే మరణించాడు.అనారోగ్యంతో దర్శకుడు తేజ కుమారుడు మరణించారు.అనారోగ్య సమస్యల కారణంగా ప్రకాష్ రాజ్ కొడుకుచనిపోయాడు . సూపర్ స్టార్ కృష్ణ పెద్ద కొడుకు రమేష్ బాబు కూడా అనారోగ్య సమస్యల కారణంగా మరణించిన సంగతి తెలిసిందే.


Follow for more Web Stories: ABP LIVE Visual Stories