కార్తికేయ - 'ఆర్ఎక్స్100' సినిమాతో హీరోగా పరిచయమైన కార్తికేయ చాలా కాలంగా ప్రేమిస్తున్న లోహితా రెడ్డి అనే అమ్మాయిని పెద్దల అంగీకారంతో వివాహం చేసుకున్నాడు.



సుమంత్ అశ్విన్ - ప్రముఖ నటుడు సుమంత్ అశ్విన్.. దీపికా అనే అమ్మాయిని వివాహం చేసుకున్నారు.



ప్రణీత - టాలీవుడ్ బాపుగారి బొమ్మ ప్రణీత ప్రముఖ వ్యాపారవేత్త నితిన్ రాజుని వివాహం చేసుకుంది.



సునీత - టాలీవుడ్ సింగర్ సునీత.. మ్యాంగో మీడియా హెడ్ రామ్ వీరపనేనిని రెండో పెళ్లి చేసుకుంది.



కత్రినా కైఫ్ - బాలీవుడ్ బ్యూటీ కత్రినా చాలా కాలంగా ప్రేమిస్తున్న విక్కీ కౌశల్ ని పెళ్లాడింది.



విద్యులేఖా రామన్ - సౌత్ ఇండియా లేడీ కమెడియన్ విద్యులేఖ ప్రముఖ ఫిట్‌నెస్, న్యూట్రషనిస్ట్‌ సంజయ్ ని ప్రేమ వివాహం చేసుకుంది.



ఆనంది - తెలుగమ్మాయి ఆనంది తమిళ సినిమాలకి కో డైరెక్టర్ గా పనిచేస్తున్న సోక్రటీస్‌ ను ఈ ఏడాదిలోనే పెళ్లి చేసుకుంది.



యామీ గౌతమ్ - ప్రముఖ దర్శకుడు ఆదిత్యను పెళ్లాడింది నటి యామీ గౌతమ్.



దియా మీర్జా - బాలీవుడ్ ముద్దుగుమ్మ దియా ప్రముఖ వ్యాపారవేత్త వైభవ్‌ రేఖీని రెండో పెళ్లి చేసుకుంది.



రాజ్ కుమార్ రావు - ప్రముఖ బాలీవుడ్ నటుడు రాజ్ కుమార్ తన గర్ల్ ఫ్రెండ్ పత్రలేఖను వివాహం చేసుకున్నాడు.