మకర రాశి వార ఫలాలు ( ఫిబ్రవరి 12 to 18) మకర రాశివారికి ఈ వారం గ్రహాలు అనుకూలిస్తున్నాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తిచేయాలి. ముందస్తు ప్రణాళికలు మేలు చేస్తాయి. కుటుంబ సభ్యులతో కలిసి తీసుకునే నిర్ణయాలు మేలుచేస్తాయి ఒంటరిగా ఏ పనీ చేయవద్దు. సమష్టి కృషి అవసరం ఏ విషయంలోనూ తొందరపనికిరాదు. గత వారం గజిబిజి పరిస్థితి ప్రస్తుతం క్లియర్ అవుతుంది. మీ జీవితంలో కొత్త పురోగతి ఉంటుంది. సరైన సయంలో సరైన నిర్ణాలు తీసుకుంటారు. ఆరోగ్యం, ఆర్థిక స్థితి బావుంటుంది. పెద్దల ఆశీర్వాదంలో అనుకున్న పనులు పూర్తవుతాయి ఉద్యోగులు సానుకూల ఫలితాలు పొందుతారు. Images Credit: Pixabay