నిద్ర తగ్గితే హై బీపీ వచ్చే అవకాశం ఉందా?

ఆరోగ్యంగా ఉండాలంటే చక్కగా నిద్రపోవాలంటున్నారు వైద్యులు.

నిద్రలేమి వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందంటున్నారు.

సరైన నిద్రలేకపోతే ఒత్తిడి హార్మోన్ల ఉత్పత్తి పెరిగి రక్తపోటు పెరిగే అవకాశం ఉంది.

దీర్ఘకాలంగా ఇదే కొనసాగితే హైబీపీగా మారిపోయే అవకాశం ఉంది.

రక్తనాళాల లోపలి పొరలు ఆరోగ్యంగా ఉండాలంటే నిద్ర చాలా ముఖ్యం.

నిద్రలేమితో బాధపడుతున్న వారికి ఇన్సులిన్ నిరోధకత వచ్చే ప్రమాదం ఎక్కువ.

దీనివల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగి మధుమేహం వచ్చే అవకాశం ఉంటుంది.

మధుమేహం, అధిక రక్తపోటు రాకూడదు అనుకుంటే రోజూ 8 గంటలు నిద్రపోవాలి. All photos Credit: pexels.com