ఏప్రిల్ 1, 2026న దేశంలో అనేక కొత్త ఆదాయపు పన్ను నిబంధనలు అమలులోకి వచ్చాయి.

కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ 2026 ద్వారా పన్ను విధానంలో అనేక మార్పులు చేసింది.

ఈ మార్పుల గురించి తెలుసుకోకపోతే నష్టం జరిగే అవకాశం

కొత్త ఆదాయపు పన్ను చట్టం 2025 నేటి నుండి అమలులోకి వచ్చింది ఇది 1961 నుండి అమలులో ఉన్న పాత చట్టం స్థానంలో వస్తుంది

ఆదాయపు పన్ను శ్లాబులలో పన్ను చెల్లింపుదారులకు ఉపశమనం కలిగించేలా ఎటువంటి మార్పులు చేయలేదు.

పన్ను చెల్లింపుదారులకు ఇప్పుడు వారి పన్నులను దాఖలు చేయడానికి ఎక్కువ సమయం ఉంటుంది

వారి కోసం ITR-3 , ITR-4 దాఖలు చేయడానికి చివరి తేదీని జూలై 31 నుండి ఆగస్టు 31 వరకు పొడిగించారు.

ప్రభుత్వం టాక్స్ కలెక్టెడ్ ఎట్ సోర్స్రే ట్లలో కొన్ని ముఖ్యమైన మార్పులు చేసింది

మద్యం అమ్మకాలపై టీసీఎస్ 1 శాతం నుంచి 2 శాతానికి పెంచారు.

LRS కింద విదేశీ ప్రయాణ ప్యాకేజీలపై ఇప్పుడు ఒకే విధమైన 2 శాతం TCS వసూలు చేస్తారు.

విద్య, వైద్య చికిత్స కోసం విదేశాలకు పంపిన డబ్బుపై TCS కూడా తగ్గించి 2 శాతం చేశారు.