అకౌంట్ నుండి కట్ అయినా, ఏటీఎం నుండి డబ్బులు రాకపోతే ఏం చేయాలి?

Published by: Shankar Dukanam
Image Source: pinterest

ఏటీఎం నుండి డబ్బులు విత్ డ్రా చేయడంతో పాటు మరెన్నో పనులు చేసుకోవచ్చు. అకౌంట్ నుంచి మనీ కట్ అయినా, కొన్నిసార్లు నగదు రాదు

Image Source: pinterest

ఆర్బీఐ నిబంధనల ప్రకారం, బ్యాంకు ఫెయిల్ ట్రాన్సాక్షన్ల నగదును వీలైనంత త్వరగా తిరిగి ఇవ్వాలి.

Image Source: pinterest

ఏటీఎం నుంచి మనీ కట్ అయిన తరువాత మీకు T+5 రోజుల్లోపు డబ్బులు మీ ఖాతాలో తిరిగి జమ కావాలి

Image Source: pinterest

T అంటే ట్రాన్సాక్షన్ జరిగిన రోజు. కాగా, ఆ రోజు తరువాత 5 పనిదినాల్లోపు బ్యాంకు ఖాతాలో జమ కావాలి

Image Source: pinterest

ఈ ప్రక్రియ ఆటోమేటిక్ గా జరగాలి. ఇందుకోసం మీరు బ్యాంకుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు.

Image Source: pinterest

మీ డబ్బులు 5 రోజుల్లో బ్యాంకులో జమ కాకపోతే, ఆరో రోజు నుండి రోజుకు బ్యాంకు రూ. 100 జరిమానా చెల్లించాలి.

Image Source: pinterest

జరిమానా పొందడానికి ఫిర్యాదుదారులు 30 రోజులలోపు కంప్లైంట్ చేసి ఉండాలి.

Image Source: pinterest

ఆర్బీఐ రూల్స్ ప్రకారం, మీరు వేరే బ్యాంకు ATM ఉపయోగించినప్పటికీ, డబ్బులు కట్ అయితే తిరిగి ఇవ్వాలి.

Image Source: pinterest

నేడు చాలా బ్యాంకులు యాప్, వెబ్‌సైట్లలో కంప్లైంట్ చేసే అవకాశం కల్పించారు

Image Source: pinterest