రెపో రేటు తగ్గించిన ఆర్బీఐ.. ఇంటి లోన్​పై తగ్గిన ఈఎంఐ

బ్యాంక్​లో రుణాలు తీసుకున్నవారికి ఆర్బీఐ మరోసారి శుభవార్త తెలిపింది.

వరుసగా మూడుసార్లు రెపో రేటు తగ్గించింది. దీంతో రుణం తీసుకున్న వారికి ప్రయోజనం అందుతుంది.

రెపో రేటుతో లింక్ అయిన రుణాలు తీసుకున్న వారికి మంచి బెనిఫిట్స్ అందుతాయి.

ముఖ్యంగా ఇంటి నిమిత్తం రుణం తీసుకున్న వారి ఈఎంఐ తగ్గుతుంది.

బ్యాంక్ ఆఫ్ బరోడా రెపో లింక్డ్ లెండింగ్ రేటును 50 బేసిస్ పాయింట్లు తగ్గించి 8.15 శాతానికి తగ్గించారు.

పంజాబ్ నేషనల్ బ్యాంక్ రెపో లింక్డ్ లెండింగ్ రేటును 8.85 నుంచి 8.35కి తగ్గించింది.

బ్యాంక్ ఆఫ్ ఇండియా వడ్డి రేట్లను 50 బేసిస్ పాయింట్లు తగ్గించింది. ఇప్పుడు రెపో లింక్డ్ లెండింగ్ రేటు 8.35.

యూకో బ్యాంక్ మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ ఆధారిత రుణ రేటు తగ్గించారు. 10 బేసిస్ పాయింట్లు తగ్గాయి.