వంకాయ కూర భలే రుచిగా ఉంటుంది కదూ. కానీ, కొందరికి మాత్రమే దాన్ని ఆశ్వాదించే లక్ ఉంటుంది. ఎందుకంటే, కొంతమందికి వంకాయ అస్సలు పడదు. అలాగని వంకాయ హానికరమైనది కూడా కాదు. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. శరీరానికి అవసరమైన విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు వంటి పోషకాలు ఉంటాయి. రక్తహీనతతో బాధపడుతున్నారా? అయితే, అస్సలు వంకాయ జోలికి వెళ్లొద్దు. ఇది రక్త ఉత్పత్తిని తగ్గిస్తుంది. కిడ్నీ(మూత్రపిండాలు)లో రాళ్లు ఉన్నవారు కూడా వంకాయను తినకూడదు. మీకు జీర్ణ సమస్యలుంటే వంకాయ తినకపోవడమే బెటర్. వంకాయ వల్ల గ్యాస్ సమస్యలు రావచ్చు. డిప్రెషన్ మాత్రలు వాడేవారు వంకాయకు దూరంగా ఉండాలి. మీకు పైల్స్ (మూలశంక) ఉన్నట్లయితే, వంకాయ మరింత తీవ్రం చేస్తుంది. కాబట్టి తినొద్దు. మీకు అలర్జీ ఉంటే వంకాయకు దూరంగా ఉండాలి. పొరపాటున తింటే దురదలు వస్తాయి. అలర్జీ తీవ్రమవుతుంది. Images Credit: Pexels