Image Source: dharma productions instagram

ప్రచార చిత్రాలు, వివాదాలు, అడ్వాన్స్ బుకింగ్స్... ఏదొక కారణంతో 'బ్రహ్మాస్త్ర' వార్తల్లో నిలిచింది. ఈ సినిమా ఎలా ఉంది?

కథేంటి? : సకల అస్త్రాలకు దేవత... 'బ్రహ్మాస్త్ర'. దాన్ని దక్కించుకోవాలని దేవ్ మనుషులు (మౌనీ రాయ్ & కో) ప్రయత్నిస్తుంటారు. 

'బ్రహ్మాస్త్ర'ను కాపాడటానికి గురు (అమితాబ్), మోహన్ భార్గవ్ (షారూఖ్), అనీష్ శెట్టి (నాగార్జున)తో కూడిన బృందం పని చేస్తుంటుంది. 

హోరాహోరీ యుద్ధంలో 'బ్రహ్మాస్త్ర'ను శివ (ర‌ణ్‌బీర్‌), అతని ప్రేయసి ఇషా (ఆలియా) ఎలా కాపాడారు? అనేది సినిమా.

ఎలా ఉంది? : 'బ్రహ్మాస్త్ర'లో మైథాలజీ అంశాల కంటే ప్రేమకథ ఎక్కువైంది. అది ప్రేక్షకుల్ని విసిగిస్తుంది.

దైవ శక్తి, దుష్ట శక్తి మధ్య యుద్ధం కంటే ప్రేమ కథపై దర్శకుడు అయాన్ ముఖర్జీ ఫోకస్ చేయడంలో కథ గాడి తప్పింది.  

పాటలు బావున్నాయి. కానీ, కథను చెప్పడంలో ఫెయిల్ అయ్యాయి. సినిమాకు సరైన డివోషనల్ థీమ్ మ్యూజిక్ మిస్ అయ్యింది. 

వీఎఫ్ఎక్స్ బావున్నాయి. కానీ, ఓవర్ అయినట్టు అనిపిస్తుంది. సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ వేల్యూస్ సూపర్. 

ర‌ణ్‌బీర్‌, ఆలియా, షారూఖ్, నాగార్జున, మౌనీ రాయ్... నటీనటులంతా పాత్రలకు న్యాయం చేశారు. సినిమాను మరో మెట్టు ఎక్కించారు.

మూడు ముక్కలైన 'బ్రహ్మాస్త్ర' కోసం జరిపే అన్వేషణే సినిమా. స్టార్టింగ్, ఇంటర్వెల్, క్లైమాక్స్... ఈ మూడు బావున్నాయి. మిగతాది ట్రాష్.

ప్రేక్షకుడిని భక్తిలోకి తీసుకువెళ్లి, తెరపై సన్నివేశాలతో మమేకం చేసినప్పుడు ఇలాంటి సినిమాలు విజయం సాధిస్తాయి.

ఫ్లాపుల్లో ఉన్న బాలీవుడ్‌కు 'బ్రహ్మాస్త్ర' రిజల్ట్ మరో షాక్ అని చెప్పుకోవాలి. క్రిటిక్ రివ్యూస్ బావున్నా... ఆడియన్స్ మాత్ టాక్ బాలేదు.