సన్నీ డియోల్ కుమారుడు కరణ్ డియోల్ వివాహం తర్వాత, డియోల్ కుటుంబం వార్తల్లో నిలుస్తూ వచ్చింది.

కరణ్ సంగీతంలో బాబీ డియోల్, అతని భార్య తాన్యల డ్యాన్స్ అందరినీ ఆకట్టుకుంది.

ఈ క్యూట్ కపుల్ ముంబైలో డిన్నర్ చేస్తూ కనిపించారు.

వీరి ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి.

కానీ బాబీ లుక్‌ను నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు.

బాబీ డియోల్ ప్రస్తుతం రణ్‌బీర్ కపూర్ ‘యానిమల్’ సినిమాలో నటిస్తున్నారు.

ఈ సినిమా ఆగస్టు 11వ తేదీన విడుదల కానుంది.

‘అర్జున్ రెడ్డి’ ఫేమ్ సందీప్ రెడ్డి వంగా ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.

రణ్‌బీర్ కపూర్ సరసన రష్మిక మందన్న ‘యానిమల్’లో నటిస్తున్నారు.