సీఎం కేసీఆర్ గజ్వేల్ నుంచి నెగ్గగా, కామారెడ్డి నుంచి ఓటమిపాలయ్యారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కోడంగల్ నుంచి గెలుపొందగా, కామారెడ్డిలో 3వ స్థానానికి పరిమితం అయ్యారు కామారెడ్డిలో సీఎం కేసీఆర్, రేవంత్ రెడ్డిలను బీజేపీ అభ్యర్థి వెంకట రమణారెడ్డి ఓడించారు బీఆర్ఎస్ అభ్యర్థి కేసీఆర్‌పై 6,741 ఓట్ల ఆధిక్యంతో రమణారెడ్డి గెలిచారు. కేసీఆర్‌ను ఓడించిన వెంకటరమణారెడ్డి ఒకప్పుడు బీఆర్‌ఎస్ లీడర్. టీఆర్ఎస్ లో గుర్తింపులేదని అలకబూని బీజేపీలో చేరి 2018లో పోటీ చేసి ఓడిపోయారు రైతులతో కలిసి కామారెడ్డి మాస్టర్‌ప్లాన్‌కు వ్యతిరేకంగా పోరాటం చేసి రద్దు చేయించారు గత ఏడాది నుంచి కామారెడ్డిలో కులసంఘాల భవనాలను, దేవాలయాలను సొంత నిధులతో నిర్మిస్తున్నారు రమణారెడ్డి 2006లో కాంగ్రెస్ నుంచి తాడ్వాయి జడ్పీటీసీగా గెలుపొందారు. 2008-11 వరకు నిజామాబాద్ జడ్పీ చైర్మన్‌గా చేశారు.