ఇనయా సుల్తానా పేరు ఇప్పుడు ప్రతి ఇంటిలో తెలుసు. అదంతా 'బిగ్ బాస్' మహిమ. 'బిగ్ బాస్' ఇంటిలో ఉన్నప్పుడు తనకు యంగ్ హీరో సోహైల్ అంటే క్రష్ అని ఇనయా చెప్పింది. 'బిగ్ బాస్' ఇంటి నుంచి బయటకు వచ్చిన తర్వాత సోహైల్ ను ఇనయా సుల్తానా కలిశారు. 'ప్రేమ ఉన్నంత వరకూ కాదు... ప్రాణం ఉన్నంత వరకు ప్రేమిస్తా ఉంటా' అని తన ప్రేమను వ్యక్తం చేశారు ఇనయా. మోకాళ్ళ మీద కూర్చుని మరీ గులాబీలు ఇవ్వడంతో సోహైల్ సర్ ప్రైజ్ అయ్యారు. ఇనయా నుంచి ఊహించని ప్రపోజల్ రావడంతో సోహైల్ షాక్ అయ్యారు. సోహైల్ అంటే లవ్ అని చెప్పిన ఇనయా సుల్తానా, ఆ ప్రపోజల్ వీడియోను త్వరలో యూట్యూబ్ లో పోస్ట్ చేయనున్నారు. ఇనయా సుల్తానా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశారు. త్వరలో డిఫరెంట్ కాన్సెప్ట్స్ తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.