బిగ్ బాస్ ఓటీటీ వెర్షన్ లో కంటెస్టెంట్ గా పాల్గొంది మిత్రాశర్మ.
మొదటివారంలోనే ఎలిమినేట్ అవుతుందన్న ఈమె ఇంకా హౌస్ లోనే ఉంది.
డ్రామా క్వీన్ గా హౌస్ లో పేరు తెచ్చుకుంది.
నామినేషన్స్ సమయంలో ఆమె చేసే రచ్చ మాములుగా ఉండదు.
ఇప్పటివరకు హౌస్ లో ఆమె ఏ బ్యాచ్ తో కూడా కలవలేదు.
సోలోగా గేమ్ ఆడుతూ.. తన తీరుతో కంటెస్టెంట్స్ ను కన్ఫ్యూజ్ చేస్తుంటుంది.
ఇదిలా ఉంటే.. మిత్రా చిన్నప్పటి ఫొటోలు వైరల్ అవుతున్నాయి.
ఇందులో ఆమె చాలా క్యూట్ గా ఉంది.
ఇప్పటికీ ఆమెలో ఆ క్యూట్ నెస్ పోలేదంటూ కామెంట్స్ చేస్తున్నారు.