ఓం శాంతి శాంతి శాంతిః అంటే ఏంటి



వేదాల్లో చెప్పే ఏ మంత్రంలో అయినా చివర్లో ఓం శాంతి ... శాంతి ... శాంతిః అని మూడుసార్లు చెబుతారు. ఎందుకలా చెబుతారు, ఆ మంత్రం వెనుకున్న ఆంతర్యం ఏంటి...



మూడు సార్లు శాంతి మంత్రాన్ని చెప్పడం వెనుక ఆంతర్యం ఏంటంటే...
1 ఆధ్యాత్మిక ...
2 ఆదీ దైవిక ...
3 ఆది భౌతిక...



మొదటి శాంతి
ప్రకృతి పరంగా సంభవించే ( భూకంపాలు / అగ్నిప్రమాదాలు / వరదలు / తుఫాన్లు ) ఉపద్రవాలు వలన ఏవిధమైన ఆపదలు కలగకుండా మానవాళిని రక్షించమని అర్థం. దీన్ని ఆధ్యాత్మిక శాంతి అంటారు.



రెండవ శాంతి
మనం, మన చుట్టూ ఉన్నవారు, పరిసరాలు, అంతా బావుండాలని, శారీరక , మానసిక పరంగా సంభవించే ఉపద్రవం ( అనారోగ్యం ) నుంచి ఉపశమనం పొందడానికి, అందరిపైనా దేవుడి అనుగ్రహం, ఆశీస్సులు ఉండాలని ప్రార్థించేదే ఆదీ దైవిక శాంతి అంటారు.



మూడవ శాంతి
ఇతర జీవరాశుల నుంచి , మనుషుల నుంచి ఏ విధమైన ఆపదలు, ముప్పు సంభవించకుండా సురక్షితంగా ఉండేందుకు మూడో శాంతి మంత్రం పఠిస్తారు. దీన్ని ఆది భౌతికము అంటారు.



తైత్తిరీయ ఉపనిషత్తు, కథా ఉపనిషత్తు, శ్వేతాశ్వతార ఉపనిషత్తులలో శాంతి మంత్రం

ఓం సహ నావవత్తు |
సహ నౌ భునక్తు |
సహ వీర్యం కరవావహై |
తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై ||
ఓం శాంతిః శాంతిః శాంతిః ||



బృహదారణ్యక ఉపనిషత్తు, ఈశావాస్య ఉపనిషత్తులో శాంతి మంత్రం
ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే |
పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే ||
ఓం శాంతిః శాంతిః శాంతిః ||



ఈశాన సర్వ విద్యానాం
ఈశ్వర సర్వభూతానాం
బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి
బ్రహ్మా శివోమే అస్తు సదా శివోం
ఓం శాంతిః శాంతిః శాంతిః ||



దేవుడిని పూజించినప్పుడు మనకోసమే కాకుండ మనతో సహా జీవింవించే సాటి ప్రాణులను, ప్రకృతిని ఈ సృష్టిలోని సమస్తం బాగుండాలని కోరుకుంటేనే మనం బాగుంటాం. అందరూ బాగుంటే అందులో మనం ఉంటాం.