‘బిగ్ బాస్’తో తెలుగు ప్రేక్షకుల అభిమానం పొందాడు అభిజీత్. ‘బిగ్ బాస్’ సీజన్-4లో అభిజీత్ విజేతగా నిలవడానికి కారణం అదే. దాదాపు రెండేళ్ల తర్వాత అభి మళ్లీ ముఖానికి రంగేశాడు. అభి తాజాగా ‘మోడ్రన్ లవ్ హైదరాబాద్’ వెబ్ సీరిస్‌లో నటించాడు. అభి నటించిన ఈ వెబ్ సీరిస్ ప్రస్తుతం ‘అమెజాన్ ప్రైమ్ వీడియో’లో స్ట్రీమ్ అవుతోంది. ఈ సీరిస్ తర్వాత అభి మళ్లీ ఏ కొత్త ప్రాజెక్ట్‌కు సైన్ చేయలేదు. మళ్లీ బ్రేక్ రావడంతో అభి మళ్లీ ప్రపంచాన్ని చుట్టేస్తున్నాడు. ప్రస్తుతం అభిజీత్ మలేషియాలోని సముద్ర దీవుల్లో విహరిస్తున్నాడు. ఓ బోటులో ప్రయాణిస్తూ.. ఒక్కసారిగా సముద్రంలోకి దూకేశాడు. ఆ వీడియో ఇదే. (Images & Videos: Abijeet/Instagram)