'కృష్ణగాడి వీరప్రేమ గాథ' సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది మెహ్రీన్ మొదటి సినిమాతోనే సక్సెస్ అందుకోవడంతో ఇండస్ట్రీలో అవకాశాలు వచ్చాయి. 'ఎఫ్2', 'మహానుభావుడు' వంటి సినిమాలతో సూపర్ హిట్స్ అందుకుంది. అయితే ఈ మధ్యకాలంలో ఎంగేజ్మెంట్ బ్రేకప్ తో వార్తల్లో నిలిచింది మెహ్రీన్. పెళ్లిని పక్కన పెట్టి కెరీర్ పై ఫోకస్ పెట్టింది ఈ బ్యూటీ. ఇప్పుడు వరుస సినిమాలను లైన్లో పెడుతూ బిజీగా మారింది. ఆమె నటించిన 'ఎఫ్3' సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఇదిలా ఉండగా.. ఇప్పుడు ఈ బ్యూటీ అమెరికా ట్రిప్ కి వెళ్లింది. అక్కడ మయామి, ఫ్లోరిడాలలో తిరుగుతూ ఎంజాయ్ చేస్తోంది. దీనికి సంబంధించిన ఫొటోలను అభిమానులతో పంచుకుంది.