మలయాళీ ముద్దుగుమ్మ నజ్రియా నజీమ్ 'రాజారాణి' సినిమాతో టాలీవుడ్ వారికి దగ్గరైంది. ఆ తరువాత మాత్రం ఆమె నటించిన సినిమా ఏదీ తెలుగులో రిలీజ్ కాలేదు. మలయాళంలో కూడా ఆమె చాలా గ్యాప్ తీసుకొని సినిమాలు చేస్తుంటుంది. ఒక్కోసారి నాలుగేళ్లు కూడా గ్యాప్ తీసుకుంటుంది. దీంతో జనాలు కూడా ఆమె నుంచి ఎప్పుడు సినిమా వస్తుందా..? అని ఎదురుచూడడం మానేశారు. రీసెంట్ గా ఈ బ్యూటీ తెలుగులో ఎంట్రీ ఇచ్చింది. నాని నటించిన 'అంటే సుందరానికి' సినిమాలో హీరోయిన్ గా నటించింది నజ్రియా. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా పెద్దగా వర్కవుట్ కాలేదు. ఇదిలా ఉండగా.. రీసెంట్ గా నజ్రియా తన ఇన్స్టాగ్రామ్ లో కొన్ని ఫొటోలు షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫొటోలు వైరల్ అవుతున్నాయి.