విజయవాడకు శ్రీసత్య- బిగ్ బాస్ బ్యూటీకి ఫాలోయింగ్ మామూలుగా లేదుగా! బిగ్ బాస్ సీజన్-6లో శ్రీసత్య స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. తొలుత బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చింది ఆడ్డానికి కాదు, చూడ్డానికే అనేలా ప్రవర్తించింది. ఆ తర్వాత నెమ్మదిగా చక్కటి ఆటతీరుతో ఆకట్టుకుంది. 15 వారాల పాటు బిగ్ బాస్ హౌస్ లో కొనసాగింది. ఇంకా ఒక్కరోజులో విజేత ఎవరో తెలిసిపోతుందనగా శ్రీసత్య ఎలిమినేట్ అయ్యింది. ఎలిమినేషన్ తర్వాత విజయవాడకు వెళ్లిన శ్రీసత్యకు గ్రాండ్ వెల్ కమ్ లభించింది. డప్పు దరువులు, పూల వర్షంతో స్వాగతం పలికారు. భారీ ర్యాలీతో ఊరేగింపుగా తీసుకెళ్లి ఘన సన్మానం చేశారు. Photos & Videos Credit: Sri Satya/Instagram