'కార్తికేయ 2' విజయం తర్వాత నిఖిల్, అనుపమ జంటగా నటించిన '18 పేజెస్' థియేటర్లలో విడుదలైంది.

కథ ఏంటి? : సిద్ధూ (నిఖిల్) యాప్ డెవలపర్. బ్రేకప్ బాధలో ఉన్న అతడికి ఓ రోజు రోడ్డు మీద డైరీ దొరుకుతుంది. 

నందిని (అనుపమ పరమేశ్వరన్) రాసిన ఆ డైరీ చదువుతూ... ఆమెతో ప్రేమలో పడతాడు నిఖిల్.

నందిని డైరీలో పేజీలు పూర్తయ్యాక... ఆమెకు ఏమైందో తెలుసుకోవాలని ఊరిలో వాళ్ళింటికి వెళతాడు. 

అక్కడ నందిని కనిపించదు. ఆమెకు ఏమైంది? నందిని కోసం వెళ్ళిన సిద్ధూపై ఎటాక్ ఎందుకు జరిగింది? అనేది సినిమా. 

ఎలా ఉంది? : '18 పేజెస్' ప్రేమకథ మాత్రమే కాదు... ఇందులో బోలెడు ట్విస్టులు, టర్నలు కూడా ఉన్నాయి.

సుకుమార్ రాసిన ప్రేమ కథకు ఉత్కంఠ కలిగించే కథనం రాసి దర్శకుడు సూర్య ప్రతాప్ సినిమా తీశారు.

హీరోయిన్‌ను ఎందుకు చంపాలని అనుకున్నారు? ఆ కాన్‌ఫ్లిక్ట్ బలంగా లేదు. ట్విస్ట్ ఇచ్చినా ఊహించడం పెద్ద కష్టం కాదు. 

'18 పేజెస్'కు పాటలు, నేపథ్య సంగీతం బలంగా నిలిచాయి. సినిమాలోని అన్ని పాటలూ బావున్నాయి.

స్మార్ట్ ఫోన్స్, సోషల్ మీడియాకు దూరంగా, వృద్ధులకు దగ్గరగా ఉండాలని చక్కటి సందేశాన్ని ఇచ్చారు. 

నిఖిల్, అనుపమ జోడీ బావుంది. తెరపై ఒక్క ఫ్రేములో కనిపించకపోయినా వాళ్ళ ప్రేమను ఫీల్ అవుతాం. 

ఇదొక విభిన్నమైన ప్రేమకథ. హృదయానికి హత్తుకునే సన్నివేశాలు ఉన్నాయి. ప్రేమకథలో నావెల్ పాయింట్ ఉంది.