త్రివిక్రమ్ డైలాగుల్లో పదును ఉంటుంది. పవర్ స్టార్ కోసం ఆయన పెన్ను పడితే... పదునుతో పాటు పవర్ కూడా తోడు అవుతుంది. 'భీమ్లా నాయక్' డైలాగుల్లో అది కనిపించింది. ఆ సినిమాలో పవర్ ఫుల్ డైలాగ్స్ ఏవో ఓ లుక్ వేయండి. 



గజనీ మహమ్మద్‌కి యుద్ధం అంటే భయం లేదు. గెలవడం, ఓడటంతో సంబంధం లేదు. నేను కూడా సేమ్ తో సేమ్!

నువ్ పీకేయ్... నేను మళ్ళీ మొలుస్తా. నువ్ తొక్కెయ్... మళ్ళీ లేస్తా. నేను ఓడినా వస్తా... నీకు ఆపలేని యుద్ధం ఇస్తా. 

నేరస్తుడి తల బరువు సార్, దించుకునే ఉండాలి. సైనికుడి తల పొగరు సార్, ఎత్తుకునే ఉండాలి. పోలీస్ తల బాధ్యత సార్, తిన్నగా ఉండాలి

అడివి కన్ను తెరిచిందా... ప్రతి కొమ్మ విల్లు అవుతుంది, ప్రతి ఆకు బాణం అవుతుంది. ప్రతి చెట్టు యుద్ధం చేస్తుంది. పిట్టలు కూడా ఫిరంగులు అవుతాయి. చివరికి గడ్డిపరక కూడా గొడ్డలై పైకి లేస్తుంది. అడ్డమొచ్చిన వాడి తల తెగనరుకుతుంది. 



నేను కొడితే ఎలా ఉంటుందో వాడికి బాగా తెలుసు. ఏ రేంజ్ లో కొట్టగలనో వాళ్లకు తెలుసు. 

మొన్న హీరో అన్నాడు... నిన్న విలన్ అంటున్నాడు. వాడి మాటల మీద వాడికే క్లారిటీ లేదు. 

అడవి అంటే అమ్మ కాదురా, నువ్వేం చేసినా భరించడానికి! అమ్మోరు! - పవన్ 

నేను చెప్పేది లా... వినకపోతే ఎలా?

యూనిఫామ్ వేసుకున్న తర్వాత నీ ఈగోని ఇంట్లో తాళం పెట్టి రా... రూల్స్ ఫాలో అవ్వకపోతే తోలు తీస్తా