కీరవాణి రెండో కుమారుడు, యువ హీరో శ్రీసింహ నటించిన క్రైమ్ కామెడీ 'భాగ్ సాలే'. ఇందులో ప్లస్, మైనస్ పాయింట్స్ ఏంటి?

కథ : అర్జున్ (శ్రీసింహ) షెఫ్. పెద్ద బెజినెస్‌మెన్ అని మాయ (నేహా సోలంకి)ని ప్రేమలో పడేశాడు.

ఓ ఉంగరం కోసం మాయ తండ్రిని శామ్యూల్ (జాన్ విజయ్) కిడ్నాప్ చేస్తాడు. ఆ ఉంగరం కథేంటి? అర్జున్ ఏం చేశాడు?

అర్జున్ నేపథ్యం తెలిశాక మాయ ఏం చేసింది? నళిని (నందిని రాయ్) ఎవరు? ఈ కథ ఏ కంచికి చేరింది?

ఎలా ఉంది? : 'భాగ్ సాలే'లో కామెడీ నవ్విస్తుంది. శ్రీసింహ & సుదర్శన్, జాన్ విజయ్ & వైవా హర్ష సీన్స్ బావున్నాయి.

క్రైమ్ కామెడీ సినిమాల్లో క్రైమ్ ఎంత క్యూరియాసిటీ క్రియేట్ చేస్తే థ్రిల్ అంత బావుంటుంది. ఉంగరం ఆ క్యూరియాసిటీ క్రియేట్ చేయలేదు. 

క్రైమ్ పక్కనపెడితే... కామెడీ వచ్చినప్పుడు ఎంజాయ్ చేస్తాం. పాటలు, నేపథ్య సంగీతం బావున్నాయి.

పక్కింటి అబ్బాయిగా, ఫోజులు కొడుతూ మాయ చేసే ప్రేమికుడిగా శ్రీసింహ బాగా చేశారు. 

ఓన్లీ కామెడీ కోసం అయితే 'భాగ్ సాలే'కు హ్యాపీగా వెళ్ళవచ్చు. ఎక్కువ అంచనాలు పెట్టుకోవద్దు.  

Thanks for Reading. UP NEXT

హాట్ లుక్స్‌తో డైమండ్‌లా మెరిసిపోతున్న అందాల హయాతి!

View next story