చెడు కొలెస్ట్రాల్‌ మాత్రం ఆరోగ్యానికి చేటు చేస్తాయి. ముఖ్యంగా గుండెకు చాలా డేంజర్.

అందుకే మనం.. మంచి కొవ్వులను అందించే ఆహారాన్నే ఎక్కువగా తీసుకోవాలి. అవేంటో చూడండి.

చియా గింజలు: వీటిలో ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్స్ రక్త పీడనాన్ని కంట్రోల్ చేస్తాయి.

అవకాడో: ఇందులోని ఒలేయిక్ యాసిడ్ గుండెకు మంచిది. క్యాన్సర్ ముప్పు నుంచి కాపాడుతుంది.

నట్స్: వీటిలోని ఫ్యాట్స్, ప్రోటీన్, ఫైబర్, విటమిన్, మినరల్స్ యాంటీ ఆక్సిడెంట్లు గుండెకు మేలు చేస్తాయి.

గుడ్లు: ప్రోటీన్స్, విటమిన్స్, ఆరోగ్యకరమైన ఫ్యాట్స్‌ ఉంటాయి. ఇవి గుండెకు మేలు చేస్తాయి.

అవిసె గింజలు: ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఇవి కొవ్వును కరిగిస్తాయి.

డార్క్ చాక్లెట్: ఇందులోని ఫ్యాట్స్, విటమిన్స్, మినరల్స్, పోటాషియం, కాల్షియం, యాంటీ ఆక్సిడెంట్లు గుండెకు మేలు చేస్తాయ్.

చేపలు: వీటిలో ఉండే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ గుండెకు చాలా మేలు చేస్తాయి.

Images Credit: Pexels