కూరలో కరివేపాకే కదా అని చులకనగా చూడొద్దు. కరివేపాకుతో చాలా లాభాలున్నాయట

క్రమం తప్పకుండా కరివేపాకు వినియోగించడం వల్ల చాలా లాభాలున్నాయి.

సౌందర్య సంరక్షణలో కరివేపాకు ఉపయోగాల గురించి నిపుణులు ఏం చెబుతున్నారో తెలుసుకుందాం.

కరివేపాకులో చాలా పోషకాలున్నాయి. ఇవి జుట్టు ఆరోగ్యానికి మంచిదట.

కరివేపాకులో విటమిన్లు ఏ, సి, బి తో పాటు ఖనిజలవణాలు పుష్కలం.

వీటితొ జుట్టుకుదుళ్లు బలపడతాయి. ఫలితంగా జుట్టు తెగిపోవడం, రాలిపోవడం తగ్గుతుంది.

కరివేపాకుతో చిన్న వయసులో జుట్టు నెరిసిపోవడాన్ని నివారించవచ్చు.

కరివేపాకులోని అమైనో ఆసిడ్స్ వల్ల కెరెటిన్ స్థాయిలు పెరిగి జుట్టు పెరిగేందుకు దోహదం చేస్తుంది.

కరివేపాకులో యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు చుండ్రు వంటి స్కాల్ప్ సమస్యలను దూరం చేస్తుంది.

Representationala Image : Pixabay