హాలీవుడ్ స్టార్ సింగర్, నటి జెన్నిఫర్ లోపెజ్ ఎట్లకేలకు పెళ్లిపీటలు ఎక్కారు.



ఇప్పటికే మూడు పెళ్లిళ్లు చేసుకున్న జెన్నిఫర్ లోపెజ్ కొంతకాలంగా నటుడు బెన్ అఫ్లెక్ తో డేటింగ్ చేస్తోంది.



ఇప్పుడు ఈ జంట పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు.



ఈ విషయాన్ని జెన్నిఫర్ తన అఫీషియల్ వెబ్ సైట్ ద్వారా తెలిపింది.



కొంతమంది స్నేహితుల మధ్య జూలై 16న లాస్ వేగాస్ లో జెన్నిఫర్ లోపెజ్, బెన్ అఫ్లెక్ పెళ్లి చేసుకున్నట్లు సమాచారం.



ఈ జంటకు సోషల్ మీడియా వేదికగా నటీనటులు, అభిమానులు శుభాకాంక్షలు చెబుతున్నారు.



వీరిద్దరూ తమ కొత్త జీవితాన్ని మొదలుపెట్టడానికి ఒక కొత్త ఇల్లు తీసుకోవాలనుకుంటున్నారు.



52 ఏళ్ల జెన్నిఫర్ లోపెజ్‌కి ఇప్పటికే ఇద్దరు పిల్లలు ఉన్నారు.