అరటి తొక్కతో ఫేస్ ప్యాక్ ఇలా తయారు చేసుకోండి

Published by: RAMA
Image Source: pixabay

అరటి తొక్కతో సులభంగా ఫేస్ ప్యాక్ తయారు చేసుకోవచ్చని మీకు తెలుసా?

Image Source: pixabay

అరటి తొక్క లోపలి భాగాన్ని నేరుగా ముఖంపై 5-10 నిమిషాల పాటు రుద్దండి ఆరిన తర్వాత నీటితో ముఖాన్ని కడగండి

Image Source: pixabay

అరటి తొక్కను మిక్సీలో వేసి, అందులో 1 స్పూన్ పెరుగు కలపండి. ఇది చర్మంపై ఉన్న మురికిని తొలగించడానికి ఉత్తమమైనది.

Image Source: pixabay

తొక్కల పేస్ట్ లో ఒక స్పూన్ తేనె కలిపి 15 నిమిషాల పాటు ముఖానికి పట్టించండి. ఇది ముఖానికి అద్భుతమైన మెరుపును ఇస్తుంది.

Image Source: pixabay

తొక్కను చిన్న ముక్కలుగా కోసి, తరువాత మెత్తగా రుబ్బుకుని, కొద్దిగా పసుపు కలిపి ముఖానికి రాసుకుంటే మచ్చలు తగ్గుతాయి.

Image Source: pixabay

తొక్కల పేస్ట్ లో ఓట్స్ కలిపి ముఖానికి 5 నిమిషాలు స్క్రబ్ చేయండి, 10 నిమిషాలు ప్యాక్ వేసి నీటితో కడగండి. ముఖానికి సహజమైన మెరుపు వస్తుంది.

Image Source: pixabay

తొక్కల పేస్ట్ లో బియ్యం పిండి కలిపి ముఖానికి రాసుకోవడం వల్ల చర్మం మెరుస్తుంది.

Image Source: pixabay

పేస్ట్ లో 1 స్పూన్ రోజ్ వాటర్ కలిపి రాసుకోవడం వల్ల చర్మానికి చల్లదనం, తాజాగా ఉంటుంది

Image Source: pixabay

పేస్ట్ లో నిమ్మరసం కలపడం వల్ల జిడ్డుగల చర్మం నూనె తొలగిపోతుంది , వేప పొడి కలపడం వల్ల మొటిమలు తగ్గుతాయి

Image Source: pixabay