కొరియన్స్ చర్మం మీద మచ్చలు, గీతలు అనేది లేకుండా ఎంతో మృదువుగా మెరిసిపోతూ కనిపిస్తారు.



వారి బ్యూటీ సీక్రెట్స్ గురించి తెలుసుకోవాలని చాలామంది ఉత్సాహం చూపిస్తారు.



వాళ్ళ బ్యూటీ వెనుక సీక్రెట్ ఏంటో తెలుసా బార్లీ టీ. దీన్నే వాళ్ళు బోరి చా అని కూడ పిలుస్తారు.



ఎన్నో శతాబ్ధాలుగా కొరియన్ సంస్కృతిలో ఈ టీ అంతర్భాగం అయిపోయింది.
చర్మ పోషణ కోసం తప్పనిసరిగా తీసుకుంటారు.


బార్లీ టీ అనేది కాల్చిన బార్లీ గింజల నుంచి తయారు చేయబడిన కషాయం.
దీన్ని తయారు చేయడానికి ఒక ప్రత్యేకమైన పద్ధతి అనుసరిస్తారు.


ఒక పాత్రలో నీటిని తీసుకుని బాగా మరిగించాలి. అందులో వేయించిన బార్లీ గింజలు వేసుకోవచ్చు.



15-20 నిమిషాల వరకు బాగా మరిగించాలి. అంతే దీన్ని చల్లగా లేదంటే వేడిగా కూడా టీ తాగొచ్చు.



బార్లీ టీలో క్వెర్సెటిన్, కాటేచిన సహ యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి.
ముడతలు, గీతలు లేని చర్మం అందిస్తుంది.


బార్లీ టీ జీర్ణ సమస్యల్ని తగ్గిస్తుంది. మొటిమలు, విరోచనాలు వంటి జీర్ణ సమస్యలు చర్మ సమస్యలు కలిగిస్తాయి.



బార్లీ టీని ఐస్ క్యూబ్స్ గా చేసి ముఖంపై సున్నితంగా రుద్దుకుంటే వాపు తగ్గుతుంది.
Images Credit: Pexels