జుట్టు అందాన్నే కాదు, ఆత్మవిశ్వాసాన్ని కూడా పెంచుతుంది. జుట్టు రాలిపోతున్నా, బట్టతల వచ్చినా చాలామంది కుమిలిపోతుంటారు. డోన్ట్ వర్రీ.. భవిష్యత్తులో బట్టతల పెద్ద సమస్య కాకపోవచ్చు. ఎందుకంటే.. బట్టతలపై జుట్టు మొలిపించే మందు సిద్ధమైపోయింది. ప్రస్తుతం ఈ మందు ప్రయోగ దశలో ఉంది. బట్టతల సమస్యను ‘అలోపేసియా అరేటా’ అని కూడా అంటారు. ప్రయోగంలో భాగంగా 706 మంది అలోపియా బాధితులను పరిశీలించారు. వీరిలో 41.5 శాతం మందికి ఏడాదిలో 80 శాతం జుట్టు పెరిగింది. CTP-543 అనే ఈ మందు ‘అలోపేసియా అరేటా’ బాధితులకు వరం కానుంది. అయితే, ఈ మందు వల్ల రోగనిరోధక శక్తి తగ్గుతుంది. కాబట్టి, 10 నెలల్లో మరిన్ని ప్రయోగాలు చేసి అందుబాటులోకి తెస్తారు.