పీరియడ్స్ సమయానికి రావట్లేదా? ఇలా చేయండి పీరియడ్స్... స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థ ఆరోగ్యాన్ని సూచించే సంకేతం. కొంతమందిలో ఎప్పుడూ పీరియడ్స్ ఆలస్యమవుతుంటాయి. ఎలాంటి మందులు మింగాల్సిన అవసరం లేకుండానే పీరియడ్స్ టైమ్ కి వచ్చేలా చేసుకోవచ్చని చెబుతున్నారు ఆయుర్వేద నిపుణులు. నల్లనువ్వులను బెల్లంతో కలిపి లడ్డూలా చేసుకుని తినాలి. ఇది హార్మోన్ల అసమతుల్యతను పరిష్కరిస్తుంది. ఒక గ్లాసు నీటిలో రెండు టీస్పూన్ల సోంపు గింజలను కలిపి రాత్రంతా నానబెట్టాలి. ఉదయం లేచి ఆ నీటిని తాగేయాలి. పైనాపిల్స్ లేదా బొప్పాయిలను తరచుగా తినాలి. కలబంద ఆకును కత్తిరించి, దానిలోంచి జెల్ ను తీసి ఒక టీస్పేను తేనెతో కలిపి తినాలి. ఆస్పరాగస్ పొడిని పాలల్లో కలిపి తాగుతూ ఉండాలి. హెర్బల్ నూనెలను, ధర్వంతరం తైలాన్ని తలకు పట్టించాలి. ఇవి ఒత్తిడిని పారద్రోలతాయి.