ఆఖరి ఓవర్లో సిక్సర్ కొట్టి గెలిపించిన భారత క్రికెటర్లు

వెస్టిండీసుతో రెండో వన్డేలో అక్షర్‌పటేల్‌ ఆఖరి ఓవర్లో సిక్సర్ బాదేశాడు.

అతడు సిక్సర్ కొట్టేంత వరకు టీమ్ఇండియాలో అంతా టెన్షనే.

గతంలోనూ కొందరు ఆటగాళ్లు ఇలాంటి ఫీటుతో థ్రిల్ అందించారు.

2007 ఫిబ్రవరి.. శ్రీలంకతో టీమిండియా టీ20 మ్యాచ్‌. ఆఖరి ఓవర్లో 5 రన్స్ అవసరం కాగా ఇర్ఫాన్ సిక్సర్ బాదేశాడు.

2010లో పాక్ తో టీమ్ఇండియా తలపడింది. ఆఖరి ఓవర్లో 7 రన్స్ అవసరం కాగా భజ్జీ సిక్స్ కొట్టాడు.

2020లో ఆసీసుపై హార్దిక్ అద్భుతం చేశాడు. ఆఖరి 3 బంతుల్లో 6 రన్స్ అవసరం కాగా పాండ్య సిక్స్ కొట్టేశాడు.

2018 నిదహాస్‌ టీ20 ట్రోఫీ ఫైనల్‌ ఎవరూ మర్చిపోరు. ఆఖరి బంతిని డీకే 6 బాది బంగ్లాపై విక్టరీ అందించాడు.

2013లో లంకతో భారత్ ట్రైసిరీస్ ఫైనల్ ఆడింది. ఆఖరి 5 బంతుల్లో 15 రన్స్ అవసరం కాగా ధోనీ వరుసగా 6, 4, 6 బాదేశాడు.