భారత్‌లో వేగంగా విస్తరిస్తున్న ఎలక్ట్రిక్ వాహనాల విప్లవం

ప్రతి కంపెనీ ప్రత్యేక డిజైన్, రేంజ్ కలిగి ఉన్నాయి.

Published by: Khagesh

విశ్వసనీయత క్లాసీ డిజైన్‌కు పేరున్న బజాజ్ చేతక్ వినియోగదారులకు బాగా తెలిసిన పేరు.

బజాజ్ చేతక్ 3.0 kW లేదా 3.5 kW బ్యాటరీ ప్యాక్‌లతో లభిస్తుంది.

బజాజ్ చేతక్ కంపెనీ 153 కి.మీ. ఐడీసీ రేంజ్‌ను క్లెయిమ్ చేసినప్పటికీ,

వాస్తవంగా 100 కి.మీ.మైలేజ్‌ ఇస్తోంది.

బజాజ్ చేతక్ సర్వీసింగ్, విడిభాగాల లభ్యత చాలా మెరుగ్గా ఉంటుంది.

ధర కూడా దాదాపు ₹1,50,000 వరకు ఉంటుంది.

టీవీఎస్ ఐక్యూబ్ 2.2 kWh, 3.1 kWh, 3.5 kWh బ్యాటరీ ఆప్షన్లలో లభిస్తుంది.

క్లెయిమ్డ్ రేంజ్ 145 కి.మీ అయినా వాస్తవానికి 100 నుంచి 110 కి.మీ. వరకు ఇస్తోంది.

టీవీఎస్ ఐక్యూబ్ కేవలం 4 గంటల 40 నిమిషాలలో రీఛార్జ్ అవుతుంది.

టీవీఎస్ ఐక్యూబ్ బిల్డ్ క్వాలిటీ, కంఫర్ట్ మరియు స్పేస్ చాలా బాగుంటాయి.

టీవీఎస్ ఐక్యూబ్ గరిష్ట వేగం 78 కి.మీ/గం.

టీవీఎస్ ఐక్యూబ్ ధర ₹1,54,000 నుంచి ₹1,60,000 వరకు ఉంటుంది.

రివర్ ఇండీ స్కూటర్ డిజైన్‌లో ఫ్యూచరిస్టిక్‌గా, ప్రాక్టికాలిటీలో అగ్రస్థానంలో ఉంది.

రివర్ ఇండీ క్లెయిమ్డ్ రేంజ్ 163 కి.మీ., వాస్తవంగా 120 నుంచి 130 కి.మీ. మైలేజ్ ఇస్తోంది.

రివర్ ఇండీ ఇది డ్యూయల్ సస్పెన్షన్, 14-అంగుళాల అల్లాయ్ వీల్స్ డిస్క్ బ్రేక్‌లు కలిగి ఉంది

రివర్ ఇండీ ధర సుమారు ₹1,46,399 నుంచి ₹1,60,000 వరకు ఉంటుంది.

ఓలా ఎస్1 ప్రో ప్లస్ ఫీచర్లు, పనితీరు పరంగా అత్యంత శక్తివంతమైనది.

320 కి.మీ.రేంజ్‌ను క్లెయిమ్ చేస్తుంది. వాస్తవంగా 200 కి.మీ. వరకు అందిస్తుంది.

డ్యూయల్ ఏబీఎస్, మల్టీమోడ్ ట్రాక్షన్ కంట్రోల్ వంటి అత్యాధునిక ఫీచర్లు ఉన్నాయి.

ఓలా ఎస్1 ప్రో ప్లస్ ధర దాదాపు ₹1,60,000. హై-రేంజ్, ఫీచర్లు కోరుకునే వారికి మొదటి ఆప్షన్.

ఏథర్ ఎనర్జీ స్కూటర్లు 450ఎక్స్ , వాటి రైడ్ క్వాలిటీ ఇంజనీరింగ్‌కు ప్రసిద్ధి చెందాయి.

ఏథర్ ఎనర్జీ క్లెయిమ్డ్ రేంజ్ 161 కి.మీ. కాగా, వాస్తవంగా 125 కి.మీ. వరకు ఇస్తుంది

ఏథర్ ఎనర్జీ కేవలం 10 నిమిషాలు ఫాస్ట్ ఛార్జర్‌పై ఛార్జ్ చేస్తే 30 కి.మీ. వరకు రేంజ్ లభిస్తుంది.

ఏథర్ ఎనర్జీ దాదాపు ₹1,40,000 ఎక్స్-షోరూమ్ వరకు ఉంటుంది.