యామహా XSR 155 ధర ఎంత?

ఎంత మైలేజ్ ఇస్తోంది?

Published by: Khagesh

యమహా XSR 155 డిజైన్ పరంగా 'రెట్రోఫిల్' థీమ్‌ను పాటిస్తుంది.

పాతతరం లుక్ ఇచ్చినా సాంకేతికతలో మాత్రం అప్‌గ్రేడ్ అయింది.

బైక్‌ ప్రధాన ఆకర్షణ పవర్‌ఫుల్ ఇంజిన్.

యమహా XSR 155లో 155 సీసీ, సింగిల్ సిలిండర్, ఎస్‌ఓహెచ్‌సీ , ఫోర్ వాల్వ్, లిక్విడ్ కూల్డ్, ఫ్యూయల్ ఇంజెక్టెడ్ ఇంజిన్ ఉంది.

యమహా XSR 155 పవర్ అవుట్‌పుట్: 18.4 పీఎస్

యమహా XSR 155 గరిష్ట టార్క్: 14.2 న్యూటన్ మీటర్లు

యమహా XSR 155 క్లచ్/ట్రాన్స్‌మిషన్:

వీవీఏ ఫీచర్, స్లిప్పర్ అసిస్ట్ క్లచ్ వ్యవస్థ ఆరు-స్పీడ్ గేర్‌బాక్స్ ఉన్నాయి.

యమహా XSR 155 బైక్‌లో డ్యూయల్ ఛానెల్ ఏబీఎస్ ,

ట్రాక్షన్ కంట్రోల్ వంటి అత్యాధునిక సెక్యూరిటీ సిస్టమ్ ఉంది.

యమహా XSR 155 ముందు భాగంలో యూఎస్‌డీ ఫోర్కులు

వెనుక భాగంలో మోనోషాక్ సస్పెన్షన్ సెటప్‌ ఉంది

యమహా XSR 155 ముందు భాగంలో 100 సెక్షన్ టైరు,

వెనుక భాగంలో రేడియల్ 140 సెక్షన్ టైరు అమర్చారు.

యమహా XSR 155 ముందు డిస్క్ 282 ఎంఎం, వెనుక డిస్క్ 220 ఎంఎం బ్రేక్స్ ఉన్నాయి.

ఇది ఆర్‌15 లేదా ఎంటీ మోడల్‌లకు సమానమైన బ్రేకింగ్ వ్యవస్థ

యమహా XSR 155 బైక్ సీటు ఎత్తు 810 ఎంఎం వరకు ఉండగా, మొత్తం బరువు 137 కేజీలు.

5'6 ఎత్తు ఉన్న రైడర్లు సులభంగా డ్రైవ్ చేయవచ్చు.

యమహా XSR 155 కన్సోల్ పూర్తి డిజిటల్ ఫీచర్లతో ఉంది.

బ్లూటూత్ కనెక్టివిటీ ఉంది. మొబైల్‌లో 'వై-కనెక్ట్' యాప్‌తో కనెక్ట్ కావచ్చు

యమహా XSR 155 నావిగేషన్ ఫీచర్ లేనప్పటికీ,

కాల్, ఎస్ఎంఎస్ అలర్ట్‌లు పొందవచ్చు.

కొత్త యమహా XSR 155బైక్ హైవే, సిటీ ట్రాఫిక్‌లో 44 కి.మీ/లీటర్ మైలేజీ ఇచ్చింది.

యమహా XSR 155 ఫ్యూయల్ ట్యాంక్ సామర్థ్యం 10 లీటర్లు.

యమహా XSR 155 బైక్ ధర దాదాపు రూ.1,75,000 నుంచి రూ. 1,85,000 వరకు ఉండొచ్చు.