భారతదేశంలో ఏ లగ్జరీ కారు అత్యధికంగా అమ్ముడవుతుంది?

Published by: Shankar Dukanam

భారత ఆటోమొబైల్ రంగంలో లగ్జరీ కార్ల డిమాండ్ నిరంతరం పెరుగుతోంది.

కార్ల అమ్మకాల నివేదికల ద్వారా విక్రయాలను అంచనా వేయవచ్చు.

భారతదేశంలో అత్యధికంగా విక్రయించబడిన లగ్జరీ కార్లలో మెర్సిడెస్ బెంజ్ 2025 ఆర్థిక ఏడాదిలో అగ్రస్థానంలో ఉంది.

ఆర్థిక సంవత్సరం 2024-25లో మెర్సిడెస్ భారతదేశంలో 18,928 యూనిట్ల కార్లు అమ్మారు

మెర్సిడెస్ యొక్క FY2025 అమ్మకాలు FY2024 అమ్మకాల కంటే 4 శాతం ఎక్కువగా జరిగాయి

మెర్సిడెస్ లగ్జరీ కారులో 1993 cc నుండి 2999 cc వరకు ఇంజిన్ ఇస్తున్నారు. మోడల్ బట్టి ధరలున్నాయి

భారతదేశంలో మెర్సిడెస్ బ్రాండ్ అత్యంత ఇష్టపడే కారు E-Class LWB.

ఈ మెర్సిడెస్ బెంజ్ కారులో అమర్చిన ఈ ఇంజిన్ 194 bhp నుండి 375 bhp వరకు ఎనర్జీ జనరేట్ చేస్తుంది

మెర్సిడెస్ బెంజ్ ఈ లిమోసిన్ కారు ఎక్స్ షోరూమ్ ధర 78.50 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది.