హైదరాబాద్‌లో మారుతి బ్రెజ్జా, ఫ్రాంక్స్ ఆన్-రోడ్ ధరలు ఇవే!
Published by: Khagesh
భారతీయ ఆటోమొబైల్ మార్కెట్లో సబ్-కాంపాక్ట్ SUV సెగ్మెంట్లో మారుతి సుజుకి బ్రెజ్జా, మారుతి ఫ్రాంక్స్ అత్యంత ప్రజాదరణ పొందిన మోడల్స్
హైదరాబాద్‌లో మారుతి బ్రెజ్జా ఆన్-రోడ్ ధరలు ఎంపిక చేసుకునే వేరియంట్‌ను బట్టి సుమారు ₹9.79 లక్షల నుంచి ₹16.36 లక్షల వరకు ఉన్నాయి.
బ్రెజ్జా ఎంట్రీ-లెవల్ మోడల్ అయిన LXi ఆన్-రోడ్ ధర హైదరాబాద్‌లో దాదాపు ₹9.79 లక్షల నుంచి ₹10.03 లక్షల మధ్య ప్రారంభమవుతుంది.
బ్రెజ్జా టాప్-ఎండ్ మోడల్ ZXi Plus AT Dual Tone ఆన్-రోడ్ ధర హైదరాబాద్‌లో సుమారు ₹16.06 లక్షల నుంచి ₹16.36 లక్షల వరకు పలుకుతోంది.
ఈ SUV 1462cc పెట్రోల్ ఇంజన్‌తో వస్తుంది. ఇది మ్యాన్యువల్, ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్లతో పాటు మంచి మైలేజ్ ఇచ్చే సీఎన్‌జీ ఆప్షన్లలో కూడా లభిస్తుంది.
స్టైలిష్ కూపే డిజైన్‌తో యువతను ఆకట్టుకునే మారుతి ఫ్రాంక్స్ ఆన్-రోడ్ ధర హైదరాబాద్‌లో సుమారు ₹8.09 లక్షల నుంచి ₹14.79 లక్షల వరకు ఉంటుంది.
ఫ్రాంక్స్ బేస్ మోడల్ అయిన Sigma 1.2L MT ఆన్-రోడ్ ధర సుమారు ₹8.09 లక్షల నుంచి ₹8.26 లక్షల వరకు ఉంది.
టర్బో ఇంజన్, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చే ఫ్రాంక్స్ టాప్ మోడల్ Alpha 1.0L Turbo 6 AT Dual Tone ఆన్-రోడ్ ధర ₹14.73 లక్షల నుంచి ₹14.79 లక్షల వరకు ఉంటుంది.
హైదరాబాద్‌లో బ్రెజ్జా సీఎన్‌జీ మోడల్స్ ఆన్-రోడ్ ధర ₹11.12 లక్షల నుంచి, ఫ్రాంక్స్ సీఎన్‌జీ మోడల్స్ ధర ₹9.36 లక్షల నుంచి అందుబాటులో ఉన్నాయి.
ఫైనల్ ఆన్-రోడ్ ధరలో ఎక్స్-షోరూమ్ ధరతో పాటుగా రిజిస్ట్రేషన్ ఛార్జీలు, ఆర్టీవో ఖర్చులు, జీరో డిప్రిసియేషన్ ఇన్సూరెన్స్, ఫాస్ట్‌ట్యాగ్ వంటివి కలిసి ఉంటాయి.