హోండా యాక్టివా ఇ పాత పెట్రోల్ మోడల్ లాంటి డిజైన్ కలిగి, క్లాసిక్ లుక్‌లో వస్తుంది. వీడా VX2 మోడరన్, ఫంకీ ఎలిమెంట్స్, వైబ్రెంట్ కలర్ ఆప్షన్లతో ఆకట్టుకుంటోంది.
Published by: Khagesh
వీడా VX2లో బ్యాటరీలను బయటకు తీసి ఇంట్లోనే ఛార్జ్ చేసుకోవచ్చు. హోండా యాక్టివా ఇ స్వాప్ స్టేషన్లపై ఆధారపడాలి.
వీడా VX2 VX2 2.2 kWh, 3.4 kWh సామర్థ్యం, హోండా యాక్టివా ఇ 3 kWh సామర్థ్యాన్ని కలిగి ఉంది.
వీడా VX2 గరిష్టంగా 142 కి.మీ రేంజ్ ఇస్తుంది. హోండా యాక్టివా ఇ 102 కిమీ క్లెయిమ్డ్ రేంజ్ ఇస్తుంది. రెండింటి టాప్ స్పీడ్ 80 కిమీ/గంటగా ఉంది.
వీడా 0-40 కి.మీ వేగాన్ని 3.1 నుంచి 4.2 సెకన్లలో అందుకుంటుంది, హోండా 0-60 కి.మీ వేగాన్ని 7.3 సెకన్లలో చేరుకుంటుంది.
వీడా VX2 సీటు కింద 33.2 లీటర్ల బూట్ స్పేస్ ఉంటే హోండా యాక్టివా ఇ లో లగేజీ స్థలం పరిమితంగా ఉంటుంది.
హోండా యాక్టివా ఇలో 7-ఇంచుల కలర్ TFT డిస్‌ప్లే లభిస్తుంది. వీడా VX2లో 4.3-ఇంచుల స్క్రీన్ ఉంటుంది.
హోండా యాక్టివా ఇ లో టర్న్-బై-టర్న్ నావిగేషన్, కాల్స్ మ్యూజిక్ కంట్రోల్స్ వస్తాయి. వీడా VX2లో యాప్ కనెక్టివిటీ, జియో-ఫెన్సింగ్, రిమోట్ ఇమ్మోబిలైజేషన్ ఉన్నాయి.
వీడా VX2లో ఎకో, సిటీ, స్పోర్ట్ మోడ్స్ ఉంటే, హోండా యాక్టివా ఇ లో ఎకో, స్టాండర్డ్, స్పోర్ట్ మోడ్స్ అందుబాటులో ఉన్నాయి.
వీడాలో నెగటివ్ త్రోటిల్ ద్వారా వెనక్కి వెళ్లవచ్చు. హోండాలో యాక్సిలేటర్ వాడకుండా కేవలం 2 బటన్లు ప్రెస్ చేసి వెనక్కి వెళ్లొచ్చు.
హోండా యాక్టివా ఇ స్మార్ట్ కీ తో వస్తుంది, వీడా VX2 మాత్రం సాధారణ కీ ఇన్సర్షన్ పద్ధతితో పనిచేస్తుంది.
వీడా VX2 సుమారు ₹99,490 నుంచి ₹1,30,990 ఎక్స్-షోరూమ్ ధరలో లభిస్తుంది. హోండా యాక్టివా ఇ ₹1.17 లక్షల నుంచి ₹1.52 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంది.