హోండా యాక్టివా ఇ పై వినియోగదారుల్లో సహజంగానే భారీ నమ్మకం ఉంది. ఏథర్ ఎలక్ట్రిక్ స్కూటర్ల రంగంలో పర్ఫార్మెన్స్, టెక్నాలజీ ద్వారా ప్రీమియం బ్రాండ్‌గా గుర్తింపు తెచ్చుకుంది.
Published by: Khagesh
ఏథర్ రిజ్టా ఫిక్స్డ్ బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది. హోండా యాక్టివా ఇ మొబైల్ పవర్ ప్యాక్ అనే స్వాపబుల్ బ్యాటరీ టెక్నాలజీతో వస్తుంది.
ఏథర్ రిజ్టాను ఇంట్లో లేదా ఏథర్ ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్లలో ఛార్జ్ చేయాలి. హోండా యాక్టివా ఇ ఛార్జింగ్ కోసం గంటల తరబడి ఆగాల్సిన పనిలేదు. స్వాపింగ్ స్టేషన్‌కు వెళ్లి బ్యాటరీలు మార్చుకోవచ్చు.
పెద్దదైన, వెడల్పైన సీటును ఏథర్ రిజ్టా ఆఫర్ చేస్తోంది. హోండా యాక్టివా ఇ కూడా సాంప్రదాయ యాక్టివా లాగే సౌకర్యవంతమైన రైడింగ్ పోశ్చర్‌ను అందిస్తుంది.
ఏథర్ రిజ్టాలో ఏకంగా 34 లీటర్ల భారీ అండర్-సీట్ స్టోరేజ్ ఉంది. అదనంగా 22 లీటర్ల 'ఫ్రంక్' ఆప్షన్ కూడా ఉంది. యాక్టివా ఇ లో బూట్ స్పేస్ పరిమితంగా ఉంటుంది.
ఏథర్ రిజ్టా గరిష్టంగా 105 నుంచి 125 కిమీ రియల్ రేంజ్ ఇస్తుంది. హోండా యాక్టివా ఇ దాదాపు 100 కిమీ రేంజ్ ఇస్తుంది.
ఏథర్ రిజ్టా ఫ్యామిలీ స్కూటర్ అయినప్పటికీ 0-40 కిమీ వేగాన్ని అందుకుంటుంది. టాప్ స్పీడ్ 80 కిమీ/గంట. యాక్టివా ఇ రైడింగ్ ఎక్స్ పీరియన్స్ చాలా స్మూత్‌గా ఉంటుంది.
ఏథర్ రిజ్టాలో సెగ్మెంట్-ఫస్ట్ స్కిడ్ కంట్రోల్ ఫీచర్ ఉంది. హోండా యాక్టివా ఇ కాంబి-బ్రేకింగ్ సిస్టమ్, మెటల్ బాడీ పార్ట్స్‌తో వస్తుంది.
ఏథర్ రిజ్టా జిప్పాడ్‌లో గూగుల్ మ్యాప్స్ నావిగేషన్, లైవ్ లొకేషన్ షేరింగ్, అలెక్సా వాయిస్ అసిస్టెంట్ ఫీచర్లు ఉన్నాయి. యాక్టివా ఇ లో బ్లూటూత్ కనెక్టివిటీ, కాల్/మెసేజ్ అలర్ట్స్‌తో కూడిన డిజిటల్ స్క్రీన్ ఉంటుంది.
స్కూటర్‌ను వెనక్కి తీయడానికి ఏథర్ రిజ్టా, హోండా యాక్టివా ఇ రెండింటిలోనూ రివర్స్ మోడ్ సదుపాయం కల్పించారు.
దేశంలో షోరూమ్‌లు, సర్వీస్ సెంటర్లు ఉన్నందున యాక్టివా ఇ మెయింటెనెన్స్ సులభం. ఏథర్ రిజ్టా సర్వీస్ నెట్‌వర్క్‌ను వేగంగా విస్తరిస్తోంది.
స్టోరేజ్ స్పేస్, పెద్ద సీటు, గూగుల్ మ్యాప్స్ వంటి హై-టెక్ ఫీచర్ల కోసం Ather Rizta బెస్ట్ ఛాయిస్. బ్యాటరీ స్వాపింగ్ ఈజీనెస్, హోండా బ్రాండ్ నమ్మకం కోసం Honda Activa e మంచి ప్రత్యామ్నాయం.