ఏథర్ 450X చాలా షార్ప్, స్పోర్టీ, ఫ్యూచరిస్టిక్ డిజైన్‌తో వస్తుంది. బజాజ్ చేతక్ టైమ్‌లెస్ నియో-రెట్రో లుక్‌తో వస్తుంది.
Published by: Khagesh
బజాజ్ చేతక్ అతిపెద్ద ప్లస్ పాయింట్ దాని ఆల్-మెటల్ బాడీ. ఏథర్ 450X లైట్ వెయిట్ అల్యూమినియం కాస్ట్ ఛాసిస్, ఫైబర్ ప్యానెల్స్‌ను ఉపయోగిస్తుంది.
వేగం విషయంలో ఏథర్ 450X 90 కి.మీ/గంట వేగంతో దూసుకుపోగలదు. బజాజ్ చేతక్ 63 కిమీ నుంచి 73 కి.మీ./గంటకు పరిమితం చేస్తున్నారు.
ఏథర్ 450X కేవలం 3.3 సెకన్లలోనే 0 నుంచి 40 కి.మీ. వేగాన్ని అందుకుంటుంది. చేతక్ పవర్ డెలివరీ చాలా లీనియర్‌గా, సిటీ ట్రాఫిక్‌కు అనుకూలంగా స్మూత్‌గా సాగుతుంది.
ఏథర్ 450X 2.9 kWh, 3.7 kWh బ్యాటరీ ఆప్షన్లలో లభిస్తుంది. బజాజ్ చేతక్ అర్బేన్ , ప్రీమియం వంటి వేరియంట్లలో దాదాపు 2.9 kWh నుంచి 3.2 kWh బ్యాటరీలతో వస్తుంది.
ఏథర్ 450X 3.7 kWh వెర్షన్ సింగిల్ ఛార్జ్‌పై దాదాపు 110 కిమీ ట్రూ-రేంజ్ ఇస్తుంది. బజాజ్ చేతక్ ప్రీమియం వేరియంట్ 100 నుంచి 105 కిమీ వరకు మైలేజ్ అందిస్తుంది.
ఏథర్ 450Xలో 7-ఇంచుల బ్రైట్ యాండ్రాయిడ్ ఆధారిత టచ్‌స్క్రీన్ డ్యాష్‌బోర్డ్ ఉంటుంది. బజాజ్ చేతక్ బేస్ వేరియంట్‌లో ఎల్‌సీడీ ఉంది.
ఏథర్‌లో ఎకో, స్మార్ట్ ఎకో, రైడ్, స్పోర్ట్, అత్యంత వేగవంతమైన వార్ప్ మోడ్ ఉంటాయి. చేతక్‌లో సాధారణంగా ఎకో, స్పోర్ట్ మోడ్స్ మాత్రమే ఉంటాయి.
ఏథర్ కంపెనీకి సొంతంగా ఏథర్ గ్రిడ్ ఫాస్ట్ ఛార్జింగ్ నెట్‌వర్క్ ఉంది. బజాజ్ చేతక్ పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్లు లేదా హోమ్ ఛార్జింగ్‌పైనే ఆధారపడాలి.
ఏథర్ 450X డిస్క్ బ్రేక్స్ ఆప్షన్ ఇస్తుంది. బజాజ్ చేతక్ ముందు చక్రానికి డిస్క్, వెనుక చక్రానికి డ్రమ్ బ్రేక్ కాంబినేషన్‌తో వస్తుంది.
ఏథర్ 450X సీటు కింద 22 లీటర్ల స్పేస్ ఉంటుంది. బజాజ్ చేతక్‌లో 21 లీటర్ల బూట్ స్పేస్ లభిస్తుంది
అదిరిపోయే స్పీడ్, అడ్వాన్స్‌డ్ గాడ్జెట్లు, టచ్ స్క్రీన్ మ్యాప్స్, స్పోర్టీ లుక్ కావాలంటే ఏథర్ 450X పర్ఫెక్ట్ ఛాయిస్. ఫ్యామిలీ మొత్తం వాడటానికి స్ట్రాంగ్, నమ్మకమైన స్కూటర్ కావాలంటే Bajaj Chetak బెస్ట్ ఆప్షన్.