నందమూరి కళ్యాణ్ రామ్ 'బింబిసార' ఆగస్టు 5న విడుదలవుతోంది. దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్, రష్మిక నటించిన 'సీతా రామం' విడుదల కూడా ఆగస్టు 5 నే హిందీతో పాటు తెలుగులోనూ ఆమిర్ ఖాన్ 'లాల్ సింగ్ చడ్డా' ఆగస్టు 11న విడుదల అవుతోంది. నిఖిల్, అనుపమా పరమేశ్వరన్ జంటగా నటించిన 'కార్తికేయ 2' ఆగస్టు 12న విడుదల. నితిన్, కృతి శెట్టి జంటగా నటించిన 'మాచర్ల నియోజకవర్గం' విడుదల కూడా ఆగస్టు 12 నే. నిర్మాత బెల్లంకొండ సురేష్ రెండో కుమారుడు గణేష్ నటించిన 'స్వాతి ముత్యం' సినిమా ఆగస్టు 13న విడుదలకు సిద్ధమైంది. ఆది సాయికుమార్, పాయల్ జంటగా నటించిన 'తీస్ మార్ ఖాన్' విడుదల ఆగస్టు 19న! అనసూయ, సునీల్, సుడిగాలి సుధీర్, దీపికా పిల్లి, విష్ణుప్రియ తదితరులు నటించిన 'వాంటెడ్ పండుగాడ్' విడుదల ఆగస్టు 19న విజయ్ దేవరకొండ ఫస్ట్ పాన్ ఇండియా ఫిల్మ్, పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన 'లైగర్' ఆగస్టు 25న దేశవ్యాప్తంగా విడుదలవుతోంది. 'పలాస', 'శ్రీదేవి డ్రామా కంపెనీ' సినిమాలతో పేరు దర్శకుడు కరుణ కుమార్ దర్శకత్వం వహించిన 'కళాపురం' చిత్రాన్ని ఆగస్టు 26న విడుదల చేస్తున్నారు.