దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన సినిమా 'సీతా రామం'. వైయజంతి మూవీస్ సమర్పణలో స్వప్న సినిమా పతాకంపై అశ్వనీదత్ నిర్మించిన 'సీతా రామం' చిత్రానికి హను రాఘవపూడి దర్శకుడు. యుద్ధంతో రాసిన ప్రేమకథ అనేది 'సీతా రామం' సినిమా కాప్షన్. లెఫ్టినెంట్ రామ్ పాత్రలో యుద్ధంలో పోరాడే సైనికుడిగా దుల్కర్ సల్మాన్ కనిపించనున్నారు. రామ్ జీవితంలో ఎవరూ లేదు. అతడిని ప్రేమించే అమ్మాయి పాత్రలో, సీతగా మృణాల్ ఠాకూర్ కనిపించనున్నారు. అఫ్రీన్ పాత్రలో ముఖ్యమైన పాత్రలో రష్మికా మందన్నా నటించారు. బ్రిగేడియర్ విష్ణుశర్మ పాత్రలో సుమంత్ కనిపించనున్నారు. దుల్కర్ సల్మాన్ ఉన్నతాధికారి పాత్ర ఆయనది. బాలాజీ పాత్రలో యువ దర్శకుడు తరుణ్ భాస్కర్ నటించారు. ఆయనదీ కీలక పాత్ర అని తెలిసింది. సీతగా మృణాల్ ఠాకూర్. దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ జోడీ సినిమాలో రెండు పాటలను ఎస్పీ చరణ్ ఆలపించారు. ఆ రెండూ ఎస్పీ బాలు పాడినట్టు ఉన్నాయని ప్రేక్షకులు అంటున్నారు.