మీపై శని అనుగ్రహం ఉందని సూచించే సంకేతాలు ఇవే!

Published by: RAMA

శని శుభ స్థానంలో ఉన్నప్పుడు అన్నీ శుభవార్తలే వింటారు

ఇంటా బయటా గౌరవం పెరుగుతుంది, కష్టానికి ప్రతిఫలం లభిస్తుంది

పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకోవడం, ఊహించని విధంగా బయటపడడం శని అనుగ్రహమే

శని అనుగ్రహం ఉన్నవారు సంపూర్ణ ఆరోగ్యంతో ఉంటారు

శనివారం రోజు మీ చెప్పులు, బూట్లు పోగొట్టుకోవడం కూడా శని అనుగ్రహ సంకేతమే

ఊహించని విధంగా అప్పుల ఊబి నుంచి బయటపడతారు, ఆర్థిక పరిస్థితిలో మెరుగుదల కనిపిస్తుంది

ఎవ్వరికీ కలసిరాని శనివారం మీకు అద్భుతంగా కలిసొస్తుంది

కష్టం వచ్చినా ధైర్యంగా ఎదుర్కొంటారు కానీ నీతి తప్పరు, అక్రమంగా సంపాదించరు

శని ప్రభావం మొదట్లో నిప్పుల్లో కాల్చినట్టు ఉంటుంది కానీ ఆ తర్వాత వజ్రంలా మెరుస్తారు