కుంభ రాశిలోకి బుధుడు - ఈ 5 రాశులవారికి మంచి రొజులొచ్చినట్టే! మకర రాశిలో సంచరించిన బుధుడు...ఫిబ్రవరి 18 నుంచి కుంభ రాశిలోకి ప్రవేశించాడు. కొన్ని రాశులవారు ప్రయోజనాలు పొందుతారు. మేష రాశివారికి మానసిక ఒత్తిళ్ల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఉద్యోగులు ప్రమోషన్ కి సంబంధించిన సమచారం వింటారు. మేష రాశివారి కుటుంబ జీవితంలో సంతోషం ఉంటుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ప్రేమికుల్లో సంతోషం వృషభ రాశివారికి అన్నింటా శుభఫలితాలే. చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. ధన ప్రవాహానికి మార్గాలు సుగమం. వృషభ రాశివారి ఆర్థిక స్థితి బలపడుతుంది. ఉద్యోగంలో ప్రమోషన్ లేదా మదింపు అవకాశాలు పెరుగుతాయి. సింహ రాశి ఉద్యోగులకు అధికారుల నుంచి సహకారం. కుటుంబ జీవితంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. సింహ రాశి వారికి చేపట్టిన పనుల్లో విజయం తథ్యం. స్నేహితుల నుంచి సహకారం, వ్యాపారంలో పురోభివృద్ధికి అవకాశం ఉంది. తులా రాశివారికి ఆధ్యాత్మిక కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. చేపట్టిన పనిలో జీవిత భాగస్వామి నుంచి సహకారం ఉంటుంది. తులా రాశి ఉద్యోగులు, వ్యాపారులు, విద్యార్థులు మంచి ఫలితాలు సాధిస్తారు. ఇంటా బయటా గౌరవం పెరుగుతుంది. ధనస్సు రాశివారికి మంచి రోజులు మొదలవుతున్నాయి. ఉద్యోగులకు అనుకూల సమయం. పెట్టుబడుల నుంచి లాభాలు వస్తాయి ధనస్సు రాశివారికి ఆదాయం పెరుగుతుంది. కార్యాలయంలో అధికారుల నుంచి సహకారం. వ్యాపారంలో వృద్ధి ఉంటుంది