ఉగాది పంచాంగం 2024 to 2025 : వృషభ రాశి వార్షిక ఫలితాలు

శ్రీ క్రోధినామ సంవత్సరం వృషభ రాశివారికి బాగా కలిసొస్తుంది.

శని శుభస్థానంలో, గురుడు సంవత్సరం మొత్తం జన్మంలో ఉండడం వల్ల మీకు మంచి అనకూల సమయం.

వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. ప్రారంభించిన కార్యాలు విజయవంతంగా పూర్తిచేస్తారు. స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు.

ఉన్నత పదవులు పొందుతారు. అయితే కొన్ని ఆకస్మిక నిర్ణయాల వల్ల నష్టపోతారు, అపనిందలు, అపవాదులు ఎదుర్కోవాల్సి వస్తుంది.

వాహన ప్రమాదాలున్నాయి జాగ్రత్త. దీర్ఘవ్యాధులు బారిన పడే అవకాశం ఉంది.

విదేశాలలో ఉద్యోగాలు చేయాలి అనుకున్న వారి ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రభుత్వ ఉద్యోగులకు ఆకస్మిక బదిలీలు తప్పవు.

ఈ ఏడాది వృషభ రాశి వ్యాపారులు మంచి లాభాలు పొందుతారు.

ఈ ఏడాది కళాకారులకు మిశ్రమ ఫలితాలున్నాయి. ఎంత కష్టపడినా అవార్డులు , రివార్డులు పొందడం కష్టమే.

వృషభ రాశి రాజకీయ నాయకులకు క్రోధి నామ సంవత్సరం అనుకూల సమయం.

శ్రీ క్రోధి నామ సంవత్సరం విద్యార్థులు కష్టానికి తగిన ఫలితం పొందడం కష్టమే

ఓవరాల్ గా చెప్పాలంటే శ్రీ క్రోధి నామ సంవత్సరం వృషభ రాశివారికి శుభాశుభాలు మిశ్రమంగా ఉంటాయి. Image Credit: Pixabay