అంతర్జాతీయ క్రికెట్లో భారత్, పాక్ తలపడేందుకు మరోసారి సిద్ధమయ్యాయి!
ఆగస్టు 28, ఆదివారం ఈ రెండు జట్లు దుబాయ్ వేదికగా పోరాడనున్నాయి.
ఆసియా కప్-2022లో అభిమానులను అలరించనున్నాయి.
అభిమానులు ఎన్నాళ్లుగానో ఎదురు చూస్తున్న ఆసియాకప్-2022 షెడ్యూలును బీసీసీఐ కొన్నాళ్ల ముందే రిలీజ్ చేసింది.
ఆగస్టు 27న టోర్నీ మొదలవుతుంది. సెప్టెంబర్ 11న జరిగే ఫైనల్‌తో ముగుస్తుంది.
ఆగస్టు 28నే కాకుండా మరో రెండు సార్లు భారత్, పాక్ మ్యాచ్ జరిగే అవకాశం ఉంది.
సూపర్ 4 దశలో రెండోసారీ, కుదిరితే ఫైనల్లో తలపడొచ్చు.
ఆగస్టు 31, బుధవారం క్వాలిఫయర్‌లో అర్హత సాధించిన మరో జట్టుతో భారత్ తలపడుతుంది.
భారత్, శ్రీలంక, పాకిస్థాన్, అఫ్గానిస్థాన్, బంగ్లాదేశ్‌తో పాటు ఒక క్వాలిఫయర్ జట్టు ఈ టోర్నీ ఆడతాయి. వీటిని ఏ, బీ గ్రూపులుగా విభజించారు. వీటిలో నాలుగు జట్లు సూపర్-4 ఆడతాయి.
దుబాయ్, షార్జాను వేదికలు ఎంపిక చేశారు. సూపర్ 4 మ్యాచులన్నీ దుబాయ్‌లోనే జరుగుతాయి.