జుట్టు సంరక్షణలో అల్లం ఎన్నో ప్రయోజనాలు అందిస్తుంది. జుట్టు రాలడం, చుండ్రు వంటి సమస్యలను దూరం చేసి.. జుట్టు పెరగేలా చేస్తుంది. అల్లం రసాన్ని కొబ్బరి నూనె లేదా ఆలివ్‌నూనెలో కలిపి హెయిర్ మాస్క్‌లా వేసుకోవచ్చు. చుండ్రు సమస్య ఉంటే అల్లం రసంలో తేనె కలిపి మాస్క్ వేసుకోవచ్చు. ఈ మాస్క్ జుట్టు పొడిబారడాన్ని కూడా కంట్రోల్ చేసి మాయిశ్చరైజ్ చేస్తుంది. అల్లం, కలబంద కలిపి జుట్టుకు అప్లై చేస్తే జుట్టుకు మంచి పోషణ అందుతుంది. ఈ హెయిర్ మాస్క్ మీ జుట్టు పెరుగుదలను ప్రోత్సాహిస్తుంది. నీటిలో అల్లం వేసి మరిగించి.. ఆ నీటితో జుట్టును కడిగిన మంచి ఫలితాలుంటాయి. (Images Source : Pinterest)