అనసూయ దేవకన్యలా మారిపోయారు. ట్రోల్స్‌ను పక్కన పెట్టి, ఈ ఫొటోలను పోస్ట్ చేశారు.

‘లైగర్’ మూవీ కంటే.. ఇప్పుడు అనసూయ వ్యాఖ్యలే బాగా వైరల్ అవుతున్నాయి.

‘లైగర్’ రిలీజ్ తర్వాత ఆమె చేసిన ట్వీట్ పెద్ద దుమారమే రేపింది.

కర్మ.. కొన్నిసార్లు రావటం లేటవ్వచ్చేమో కాని రావటం మాత్రం పక్కా అని అనూ కామెంట్ చేశారు.

అనసూయ ఆ ట్వీట్‌ను రౌడీ బాయ్‌ను ఉద్దేశించే చేశారని ఫ్యాన్స్ అనుకుంటున్నారు.

ఐదేళ్ల కిందట ‘అర్జున్ రెడ్డి’లోని ఓ అభ్యంతకర డైలాగ్‌పై అనసూయ గళం విప్పారు.

అమ్మను తిడుతూ సినిమాలో ఉన్న బూతు డైలాగ్‌పై అనసూయ ఫైర్ అయ్యారు.

తాజా ట్వీట్‌తో అనసూయ ఇప్పుడు ట్రోలింగ్ ఎదుర్కొంటున్నారు.

కొందరు ఆమెను ‘ఆంటీ’ అని ఆటపట్టిస్తున్నారు.

దీంతో అనసూయ తనకు కనిపించని శత్రువుతో ట్వీట్ల యుద్ధం చేస్తున్నారు.

Images and video credit: Anasuya Bharadwaj/Instagram