హాట్ హాట్‌గా... వకీల్ సాబ్ బ్యూటీ వకీల్ సాబ్ సినిమా చూసినవారందరూ అనన్య నాగళ్లను ఇట్టే గుర్తుపట్టేస్తారు. మల్లేశం సినిమాతో టాలీవుడ్లో అడుగుపెట్టింది. మొదటి సినిమాలోనే నటనతో అదరగొట్టింది. ఈమెది ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లి. చదువుకోసం హైదరాబాద్ వచ్చేసింది. రాజా మహేంద్ర ఇంజినీరింగ్ కాలేజ్ లో బీటెక్ పూర్తిచేసింది. కొంత కాలం సాప్ట్ వేర్ ఇంజినీర్ గా పనిచేసింది. 2019లో మల్లేశం సినిమాలో అవకాశం రావడంతో నటిగా మారింది. 2021లో ఓటీటీలో విడుదలైన ప్లే బ్యాక్ సినిమాతో మంచి నటిగా పేరు తెచ్చుకుంది. వకీల్ సాబ్ సినిమాలో ముగ్గురు అమ్మాయిల్లో ఒకరిగా నటించింది ఇన్ స్టాలో ఎప్పటికప్పుడు గ్లామర్ ఫోటోలు పోస్టు చేస్తూ, గ్లామర్ పాత్రలు చేయడానికి సిద్ధం అని చెప్పకనే చెబుతోంది.