అల్పపీడనం ప్రభావంతో ఏపీ, తెలంగాణలో మోస్తరు వర్షాలు నైరుతి, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉత్తర తమిళనాడుతో పాటు దక్షిణ కోస్తా తీరాల వెంట అల్పపీడనం నేడు కేంద్రీకృతమైంది. ఏపీలో నేడు గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, ఉమ్మడి చిత్తూరు జిల్లాల్లో కొన్నిచోట్ల మోస్తరు వర్షాలు కురవనున్నాయి విశాఖ, అనకాపల్లి, తూర్పు గోదావరి, కోనసీమ, కాకినాడ, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, వైఎస్ఆర్, అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల్లో తేలికపాటి వర్షాలు గురువారం బాపట్ల, నెల్లూరు, ప్రకాశం, రాయలసీమ జిల్లాల్లో కొన్నిచోట్ల మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం అల్పపీడనం ప్రభావంతో తెలంగాణలో పలు జిల్లాల్లో రెండు రోజులపాటు వర్షాలు కురుస్తాయన్న వాతావరణ కేంద్రం తెలంగాణలో అత్యధికంగా ఖమ్మం, నిజామాబాద్ జిల్లాల్లో 33, 34 డిగ్రీల పగటి ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి హైదరాబాద్ లో వాతావరణం ఒక్కసారిగా మారిపోనుంది. ఆకాశం మేఘావృతంగా మారి గంటలకు 6 కి.మీ వేగంతో గాలులు వీచనున్నాయి రైతులు వర్షంలో తడవకుండా ధాన్యాన్ని జాగ్రత్త చేసుకోవాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు.