టాలీవుడ్ లో స్టార్ ప్రొడ్యూసర్ గా దూసుకుపోతున్న అల్లు అరవింద్ ఈరోజు పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయనకు సంబంధించిన కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు.. అల్లు అరవింద్ 1984లో విడుదలైన 'హీరో' సినిమాలో నటించారు. చిరు నటించిన 'మహానగరంలో మాయగాడు' సినిమాలో నటించారు అల్లు అరవింద్. 1986లో విడుదలైన 'చంటబ్బాయ్' సినిమాలో కమెడియన్ గా కనిపించారు అరవింద్. 'విజేత' సినిమా నిర్మాతగా ఆయనకు మంచి ఇమేజ్ తీసుకొచ్చింది. ఆ తరువాత కెరీర్ లో వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. ఇప్పుడు 'ఆహా' అంటూ ఓటీటీ ప్లాట్ ఫామ్ ను కూడా మొదలుపెట్టేశారు. నిర్మాతగా, డిస్ట్రిబ్యూటర్ గా, బిజినెస్ మెన్ గా టాప్ పొజిషన్ లో ఉన్నారు అల్లు అరవింద్.