బాలీవుడ్, తమిళ సినిమాల్లో నటించిన అదితి రావు హైదరి 'సమ్మోహనం' సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది. తొలి సినిమాతోనే మంచి హిట్ అందుకుంది. ఆ తరువాత 'అంతరిక్షం', 'వి' లాంటి చిత్రాలలో నటించింది. ఇది పెద్దగా వర్కవుట్ అవ్వలేదు. అలానే ఆమె నటించిన 'మహాసముద్రం' సినిమా కూడా డిజాస్టర్ అయింది. అయినప్పటికీ ఆమెకి అవకాశాలు వస్తూనే ఉన్నాయి. ఈ బ్యూటీ నటించిన 'హే సినామిక' ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఇదిలా ఉండగా.. అదితి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు హాట్ ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులను కవ్విస్తుంది. తాజాగా ఆమె షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.