Image Source: Pooja Kannan Instagram

నేచురల్ బ్యూటీ సాయి పల్లవి అమర్‌నాథ్ యాత్రకు వెళ్లిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన వీడియోని ఆమె సోదరి పూజా కన్నన్ షేర్ చేసింది.

Image Source: Sai Pallavi Instagram

ఇటీవల SK21 మూవీ కాశ్మీర్ షెడ్యూల్ షూటింగ్ పూర్తైన తర్వాత ఆమె తన తన తల్లిదండ్రులు, సోదరితో కలిసి అమర్‌నాథ్ ఆలయాన్ని సందర్శించింది.

Image Source: Sai Pallavi Instagram

అమర్‌నాథ్ యాత్ర విశేషాలను, అనుభవాలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా పంచుకుంటూ వచ్చింది సాయి పల్లవి.

Image Source: Sai Pallavi Instagram

60 ఏళ్ల వయసున్న తన తల్లిదండ్రులను ఈ యాత్రకు తీసుకువెళ్లడం ఎంతో సవాలుగా అనిపించిందని ఇన్‌స్టాగ్రామ్‌ పోస్టులో రాసుకొచ్చింది.

Image Source: Sai pallavi instagram

ఈ యాత్ర తన సంకల్ప శక్తికి, ధైర్యానికి పరీక్ష పెట్టిందని.. కానీ ఎంతో కాలంగా ఉన్న తన కల ఇన్నాళ్లకు నెరవేరిందని ఎమోషనల్ అయింది.

Image Source: sai pallavi instagram

'ఢీ' డ్యాన్స్ షోతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన సాయి పల్లవి.. 'ప్రేమమ్' సినిమాతో హీరోయిన్ గా మారింది.

Image Source: sai pallavi instagram

'ఫిదా' చిత్రంతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చి, తనదైన నటనతో డ్యాన్సులతో అనతి కాలంలోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది.

Image Source: sai pallavi instagram

చేసింది తక్కువ సినిమాలే అయినా తన స్క్రిప్ట్ సెలక్షన్ లో వైవిధ్యం చూపిస్తూ, హీరోలతో సమానంగా ఫాలోయింగ్ సంపాదించుకుంది.

Image Source: sai pallavi instagram

చివరగా 'గార్గి' సినిమాతో పలకరించిన ఈ బ్యూటీ.. ప్రస్తుతం కమల్ హాసన్ నిర్మాణంలో శివ కార్తికేయన్ సరసన హీరోయిన్ గా నటిస్తోంది.